ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం కోటా… హర్యానాకు సుప్రీంకోర్టులో ఊరట
చండీగఢ్: హర్యానా ప్రభుత్వానికి ఊరట లభించింది. ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం కోటా చట్టాన్ని నిలిపివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఈ నెల 3న ఇచ్చిన స్టే ఆర్టర్‌ను సుప్రీంకోర్టు పక్కకు పెట్టింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా స్టే ఆర్డర్ ఇచ్చేందుకు తగిన కారణాలు పేర్కొనలేదని తెలిపింది. అలాగే ఈ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణను నెలలోపు ముగించాలని హైకోర్టుకు సూచించింది. పిటిషన్‌దారులు వాయిదాలను కోరవద్దని పేర్కొంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం కోటాను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసే వరకు ఈ కోటా నిబంధన పాటించని ప్రైవేట్ సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హర్యానా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ చట్టంపై హైకోర్టు స్టే విధించడాన్ని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హర్యానా ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ఈ చట్టాని పూర్తిగా పరిశీలించకుండానే కేవలం 90 సెకండ్లలో స్టే విధించిందని సుప్రీంకోర్టుకు తెలిపారు.
మరోవైపు ఉద్యోగుల సంఘం తరుపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ వర్తించేజేసే ఈ చట్టానికి రాజ్యాంగపరంగా అలాంటి అధికారం లేదన్నారు. ఇతర రాష్ట్రాల ఉద్యోగుల నియామకంపై ఈ చట్టం బాగా ప్రభావం చూపుతుందన్నారు. దేశ సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రిజర్వేషన్ చట్టం ఉన్నదని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

