SBI Reward | ఎస్బీఐ రివార్డ్ పేరుతో ఫేక్ సందేశాలు.. కీలక హెచ్చరికలు చేసిన కేంద్రం..!
SBI Reward | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు కేంద్రం కీలక హెచ్చరిక చేసింది. ఎస్బీఐ ఖాతా రివార్డ్ పాయింట్స్ ఉన్నాయని.. వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ ఓ ఫేక్ మెస్సేజ్ వాట్సాప్‌లతో పాటు మెస్సేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి.
SBI Reward | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు కేంద్రం కీలక హెచ్చరిక చేసింది. ఎస్బీఐ ఖాతా రివార్డ్ పాయింట్స్ ఉన్నాయని.. వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ ఓ ఫేక్ మెస్సేజ్ వాట్సాప్‌లతో పాటు మెస్సేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో రివార్డ్ పాయింట్ల పేరుతో వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. నకిలీ సందేశాలను చూసి స్పందించొద్దని సూచించింది. వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు వివరాలను సైతం ఎవరితో వెల్లడించొద్దని చెప్పింది. ఈ మేరకు పీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ ద్వారా ఈ హెచ్చరికలు చేసింది. రివార్డ్ పాయింట్ల రిడీమ్ చేసుకునేందుకు లింక్‌ని ఓపెన్ చేయాలని చెబుతుందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ లింక్‌ను ఓపెన్ చేయొద్దని.. అలాగే మరెవరికీ షేర్ చేయొద్దని సూచించింది.
అలా చేస్తే మోసగాళ్ల బారినపడే ప్రమాదం ఉంటుందని తెలిపింది. ఎస్ఎంఎస్లు, వాట్సాప్‌ల ద్వారా ఎస్బీఐ లోగోను వాడుతూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లుగా పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఎస్బీఐ బ్యాంక్ రివార్డ్ పాయింట్ల పేరుతో ఫేక్ మెసేజెస్ వస్తుండడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి తరహా మోసాలకు నేరగాళ్లు పాల్పడిన సందర్భాలున్నాయి. ఇక ఫేక్ మెసేజ్‌లలో ‘ప్రియమైన కస్టమర్, మీ ఎస్బీఐ నెట్‌బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్ల (రూ.9980.00) గడువు నేటితో ముగుస్తుంది. ఇప్పుడు ఎస్బీఐ రివార్డ్ యాప్ ఇన్స్టాల్ ద్వారా రిడీమ్ చేసుకోండి. నేరుగా మీ ఖాతాలో నగదు డిపాజిట్ అవుతుంది’ అంటూ ఫేక్ మెసేజ్ వస్తున్నది. ఈ క్రమంలో కేంద్రం అప్రమత్తం చేస్తూ తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను లింక్‌లను క్లిక్ చేయొద్దని.. పాస్వర్డ్, క్రెడిట్‌కార్డుల వివరాలు ఎవరికీ చెప్పొద్దని కేంద్రం సూచించింది.
Beware ‼️
Did you also receive a message asking you to download & install an APK file to redeem SBI rewards❓#PIBFactCheck
❌@TheOfficialSBI NEVER sends links or APK files over SMS/WhatsApp
✔️Never download unknown files or click on such links
🔗https://t.co/AbVtZdQ490 pic.twitter.com/GhheIEkuXp
— PIB Fact Check (@PIBFactCheck) July 31, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

