ఎస్బీఐ యూజర్ల డాటా లీక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)పై సైబర్ దాడి జరిగినట్టు యాజమాన్యం అంగీకరించింది. హ్యాకర్లు బ్యాంక్‌నకు చెందిన వినియోగదారులు రికార్డులను యాక్సెస్ చేసినట్టు తెలిపింది. స్టాక్ ఎక్సేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో 3,897 మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలు డార్క్‌వెబ్‌లో బహిర్గతమై ఉండవచ్చునని వెల్లడించింది.
- సైబర్ దాడి నిజమేనన్న బ్యాంక్
- 3,897 మంది ఖాతాదారుల వివరాలు డార్క్‌వెబ్‌లో బహిర్గతం
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)పై సైబర్ దాడి జరిగినట్టు యాజమాన్యం అంగీకరించింది. హ్యాకర్లు బ్యాంక్‌నకు చెందిన వినియోగదారులు రికార్డులను యాక్సెస్ చేసినట్టు తెలిపింది. స్టాక్ ఎక్సేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో 3,897 మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలు డార్క్‌వెబ్‌లో బహిర్గతమై ఉండవచ్చునని వెల్లడించింది. ఈ ఘటన కారణంగా బ్యాంక్ ప్రధాన కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు, వ్యాపార లావాదేవీలపై ఎలాంటి గణనీయమైన ప్రభావం పడలేదని వివరించింది. వినియోగదారుల ఖాతాల డాటా లీక్ గురించి ఈ నెల 16న తమ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్ సీఈఆర్టీ-ఇన్ నుంచి తమకు హెచ్చరిక అందిందని ఎస్బీఐ తెలిపింది.
డార్క్‌వెబ్‌లో లభించిన 3,75,000 రికార్డుల ప్రాథమిక విశ్లేషణలో గుర్తించదగిన సమాచారం ఉన్న 3,897 కస్టమర్ రికార్డులను గుర్తించారు. అందులో కస్టమర్ల పేరు, వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీ, జెండర్, ఈమెయిల్, ఇంటి చిరునామాలు ఉన్నాయి. ఈ రికార్డులలో బ్రాంచ్ పేరు, కస్టమర్ సమాచార ఫైల్ ఐడెంటిఫైర్లు, లీడ్ ఐడీలు, వారికి సంబంధించిన రుణాలు, డిపాజిట్లు, ఇతర సమాచారం కూడా ఉంది. గుర్తించిన 3,897 రికార్డులపై దర్యాప్తు కొనసాగుతున్నందున, తాము పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఇంత దుర్బలత్వమా?
హ్యాకర్లు చొరబడేంత దుర్బలత్వంతో బ్యాంక్ సెక్యూరిటీ వ్యవస్థలు ఉండటం పట్ల బ్యాంక్ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలైలో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారులకు చెందిన 1 టీబీ డాటా డార్క్‌వెబ్‌లో పెట్టారు. 3.75 లక్షల మంది ఖాతాదారుల వివరాలు డార్క్‌వెబ్‌లో ఉన్నాయని ఒక పక్క ఎస్బీఐ ప్రకటిస్తూనే గుర్తించదగిన 3,897 మంది కస్టమర్ల సమాచారం గురించి మాత్రమే అధికారులు హైలెట్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, సమాచారం బహిర్గతమైన వినియోగదారులందరికీ ఎస్బీఐ వ్యక్తిగతంగా ఎస్ఎంఎస్, ఈమెయిల్ లేఖల ద్వారా సమాచారం అందించి అప్రమత్తం చేయాలని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) డిమాండ్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

