భారత్ జోడో పోస్టర్‌పై సావర్కర్ ఫొటో… ప్రింటింగ్ పొరపాటుగా పేర్కొన్న కాంగ్రెస్
‘భారత్ జోడో’ యాత్రకు సంబంధించిన పోస్టర్లో ముద్రించిన స్వాతంత్ర్య సమరయోధులలో కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ సిద్ధాంత కర్త సావర్కర్ ఫొటో కూడా ఉంది.
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రకు సంబంధించిన పోస్టర్‌పై సావర్కర్ ఫొటో ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ప్రింటింగ్ పొరపాటుగా కాంగ్రెస్ పేర్కొంది. అనంతరం సావర్కర్ ఫొటో స్థానంలో గాంధీ ఫొటోను అంటించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘భారత్ జోడో’ పేరుతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర 14వ రోజుకు చేరింది. అయితే కేరళలోని ఎర్నాకులం జిల్లాకు ర్యాలీగా వెళ్లిన నేతలకు ఊహించని షాక్ ఎదురైంది.
‘భారత్ జోడో’ యాత్రకు సంబంధించిన పోస్టర్లో ముద్రించిన స్వాతంత్ర్య సమరయోధులలో కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ సిద్ధాంత కర్త సావర్కర్ ఫొటో కూడా ఉంది. చెంగ్మనాడ్లో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్‌ను ఎల్డీఎఫ్కు మద్దతుగా ఉన్న స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ గుర్తించారు. దీంతో ఆలస్యం అయినప్పటికీ సావర్కర్‌ను స్వాతంత్ర్య సమరయోధుడిగా కాంగ్రెస్ గుర్తించిందంటూ బీజేపీ పేర్కొంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పష్టత ఇచ్చింది. ప్రింటింగ్ పొరపాటు వల్ల ఇలా జరిగినట్లు తెలిపింది. స్వాతంత్ర్య సమరయోధుల ఫొటోలు ముద్రించాలని ప్రింటర్‌కు చెప్పగా ఆన్లైన్లో వెతికి ఇలా ముద్రించారని పేర్కొంది. పొరపాటు గ్రహించిన వెంటనే స్థానిక కార్యకర్తలు ఆ ఫొటో స్థానంలో మహాత్మా గాంధీ ఫొటోను అంటించారని కేరళ కాంగ్రెస్ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

