Sanjay Raut | ఇది దేశంలోనే అత్యంత భారీ స్కామ్.. ఎలక్టోరల్ బాండ్లపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
Sanjay Raut | లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈడీ, సీబీఐ లాంటి జాతీయ దర్యాప్తు సంస్థలు దాడులు జరిపిన కంపెనీలే ఈ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడంపై పలు పార్టీలకు చెందిన నేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్టోరల్ బాండ్స్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sanjay Raut : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈడీ, సీబీఐ లాంటి జాతీయ దర్యాప్తు సంస్థలు దాడులు జరిపిన కంపెనీలే ఈ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడంపై పలు పార్టీలకు చెందిన నేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్టోరల్ బాండ్స్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గేమింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల ప్రధాన లబ్ధిదారుగా బీజేపీ ఉన్నదని సంజయ్ రౌత్ ఆరోపించారు. దేశంలోనే ఇదే అతిపెద్ద కుంభకోణమని అన్నారు. గేమింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి నిధులను నేరుగా ఆయా పార్టీల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తున్నాయని విమర్శించారు.
గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ కార్పొరేషన్ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిందని, ఆ డబ్బులు నేరుగా అధికార బీజేపీ ఖాతాలో జమయ్యాయని రౌత్ ఆరోపించారు. ఇలాంటివి గతంలో కూడా చాలానే జరిగాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేస్తూ కంపెనీలు రాజకీయ పార్టీలకు నగదు బదిలీ చేయడమనేది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని రౌత్ వ్యాఖ్యానించారు.
ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కంపెనీలపై ఇటీవల ఈడీ దాడులు జరిగాయని, ఆ తర్వాత ఆ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేశాయని రౌత్ గుర్తుచేశారు. ప్రజలు వీటిని నిత్యం గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ముందుగా ఈడీ దాడులు చేస్తుందని, కొన్ని గంటల తర్వాత ఆయా కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేస్తాయని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dulqer Salmaan | ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్!
Ramayana | ‘రామాయణ’లో తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్.. మేఘనాథుడిగా ‘ది ప్యారడైజ్’ విలన్
Jharkhand | జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
Bigg Boss 10 | రివెంజ్ తీర్చుకున్న త్రిగుణ్.. అమన్‌కు షాక్, ఫ్యామిలీని కలిసే ఛాన్స్ మిస్!
Common Pass | కామన్ పాస్ రేట్..యూటర్న్ ధరలు తగ్గించేందుకు కమిటీ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

