యోగి సర్కార్‌పై భగ్గుమన్న విపక్షం : యూపీ అసెంబ్లీ ఎదుట ఎస్పీ ధర్నా
యూపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సోమవారం సభ వెలుపల వివిధ అంశాలపై నిరసనకు దిగింది.
లక్నో : యూపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సోమవారం సభ వెలుపల వివిధ అంశాలపై నిరసనకు దిగింది. రైతాంగ సమస్యలు, శాంతిభద్రతలు, నిరుద్యోగం, ధరల మంట వంటి పలు అంశాలపై బీజేపీ సర్కార్ విధానాలను నిరసిస్తూ ఎస్పీ ఆందోళన చేపట్టింది. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ సోమవారం అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాగా ఈనెల 22న ఆర్ధిక మంత్రి సురేష్ ఖన్నా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఎస్పీ ప్రధాన కార్యదర్శి శివపాల్ సింగ్ యాదవ్ నేతృత్వంలో ఎస్పీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు చేబూని అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యలను తాము సభలో లేవనెత్తేలా అసెంబ్లీ సమావేశాలను సజావుగా నిర్వహించాలని విలేకరులతో మాట్లాడుతూ యాదవ్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో నాటిన మొక్కలనే కాపాడలేని వారు పెట్టుబడులను ఎలా నిర్వహిస్తారని యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని కాషాయ సర్కార్‌పై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు.
కాన్పూర్‌లో చేపట్టిన ఆక్రమణల తొలగింపు సందర్భంగా తల్లీకూతుళ్లు సజీవ దహనమైన ఘటనపై యోగి సర్కార్‌ను ఇరుకునపెట్టేందుకు విపక్షాలు సన్నద్ధమయ్యాయి. శాంతిభద్రతల పరిస్ధితి గాడితప్పిన తీరును అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని యోచిస్తున్నాయి. అయితే సభలో తమను ఎండగట్టేందుకు విపక్షాలకు ఎలాంటి అంశాలు లేవని బీజేపీ చెబుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

