Pet fish’s death | అక్వేరియంలోని చేప చనిపోయిందన్న మనస్తాపంతో.. బాలుడు ఆత్మహత్య
Pet fish's death | శుక్రవారం ఉదయం రోషన్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మేడ పైకి ఎక్కి పావురాలకు మేత వేశాడు. చాలా సేపటి వరకు ఇంట్లోకి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆ బాలుడి కోసం అంతా వెతికారు. రోషన్ ఎక్కడా కనిపించలేదు. చివరకు మేడ పైకి వెళ్లి చూశారు.
తిరువనంతపురం: అక్వేరియంలో పెంచుతున్న చేప చనిపోయిందన్న (Pet fish’s death) మనస్తాపంతో ఒక బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళలోని మలప్పురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పొన్నానిలోని ఒక ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల రోషన్ మీనన్ 8వ తరగతి చదువుతున్నాడు. అతడికి పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. పావురాలతోపాటు ఇంట్లోని అక్వేరియంలో చేపలు పెంచుతున్నాడు. అయితే అక్వేరియంలో పెంచుతున్న చేపల్లో ఒకటి ఇటీవల చనిపోయింది. దీంతో రోషన్ తీవ్ర మనస్తాపం చెందాడు. నాటి నుంచి దిగులుగా ఉంటున్నాడు.
కాగా, శుక్రవారం ఉదయం రోషన్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మేడ పైకి ఎక్కి పావురాలకు మేత వేశాడు. చాలా సేపటి వరకు ఇంట్లోకి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆ బాలుడి కోసం అంతా వెతికారు. రోషన్ ఎక్కడా కనిపించలేదు. చివరకు మేడ పైకి వెళ్లారు. అక్కడున్న షెడ్లో ప్లాస్టిక్ తాడుకు వేలాడుతున్న రోషన్‌ను చూసి షాకయ్యారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే రోషన్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పెంపుడు చేప చనిపోయిందన్న మనస్తాపంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు రోషన్ తండ్రి రవీంద్రన్ పోలీసులకు తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

