న్యూఢిల్లీ: రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్(Russia Minister Sergey Lavrov).. ఢిల్లీలో జరిగిన ప్రెస్మీట్లో ఓ జర్నలిస్టుకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఓ జర్నలిస్టు పదేపదే ఫోన్లో మాట్లాడుతున్న నేపథ్యంలో అతన్ని వారించే ప్రయత్నం చేశారు. కానీ ఆ జర్నలిస్టు మళ్లీ మళ్లీ ఫోన్లో మాట్లాడడడంతో .. లవ్రోవ్ డిస్టర్బ్ అయ్యారు. ఒకవేళ ఫోన్ పక్కకు పెట్టకుంటే, మా సెక్యూర్టీ సిబ్బంది గన్ తీస్తారని మంత్రి లవ్రోవ్ హెచ్చరించారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు రష్యా మంత్రి లవ్రోవ్ సమాధానాలు ఇస్తున్న సమయంలో ఓ జర్నలిస్టు తన ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు.
ఫోన్ బంద్ చేయాలని కోరినా అతను పట్టించుకోలేదు. దీంతో తన సెక్యూర్టీని జోక్యం చేసుకోవాలని మంత్రి లవ్రోవ్ కోరారు. ఇక్కడ నుంచి వెళ్లిపోండి, లేదా ఫోన్ ఆపేయండి అంటూ తొలుత లవ్రోవ్ ఆ జర్నలిస్టుకు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని క్షణాల్లోనే మళ్లీ అతను ఫోన్లో మాట్లాడాడు. ఈసారి మంత్రి లవ్రోవ్ కాస్త ఘాటుగా స్పందించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి, నేనేమీ జోక్ చేయడం లేదు, మీ ఫోన్ సరెండర్ చేయకుంటే, మా సిబ్బంది గన్ తీస్తారని హెచ్చరించారు. లవ్రోవ్ హెచ్చరికకు చెందిన వీడియో వైరల్ అవుతోంది.
‘Sir, if you don’t surrender your phone, they will take out a gun!’ – Russia’s Lavrov joking warning to a reporter sparks laughter pic.twitter.com/SYGZVIK4Ho
— Viory Video (@vioryvideo) May 15, 2026