Rahul Gandhi: కొన్ని మతాలు, భాషలను ఆర్ఎస్ఎస్ తక్కువగా చూస్తోంది: రాహుల్ గాంధీ
Rahul Gandhi: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్)పై తనదైన రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని మతాలు, భాషలు, వర్గ ప్రజలను.. ఆర్ఎస్ఎస్ చాలా హీనంగా చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi).. రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్)పై తనదైన రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని మతాలు, భాషలు, వర్గ ప్రజలను.. ఆర్ఎస్ఎస్ చాలా హీనంగా చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు. భారత్లో జరుగుతున్న పోరాటం ఇదే అని, రాజకీయ పోరాటం కాదు అని ఆయన తెలిపారు. వాషింగ్టన్ డీసీ శివారులో ఉన్న హెర్న్డాన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన భారతీయుల్ని ఉద్దేశించి మాట్లాడారు. అసలు భారత్లో దేని గురించి పోరాటం జరుగుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని, ఇది రాజకీయాల కోసం జరుగుతున్న ఫైట్ కాదు అని, ఇది అంతకన్నా విలువైందన్నారు.
మీటింగ్కు వచ్చిన ఓ సిక్కు యువకుడిని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ.. మీ పేరేంటి సోదరా, తలపాగాతో ఉన్న మీరు మీ గురించి చెప్పమన్నారు. ఓ సిక్కు మతస్థుడు భారత్లో తలపాగాను పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తారా లేదో తెలియడం లేదని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. సిక్కులను గురుద్వారాకు వెళ్లినిస్తారో లేదన్నారు. దీని కోసమే దేశంలో పోరాటం జరుగుతోందన్నారు. వాషింగ్టన్ డీసీ కన్నా ముందు డల్లాస్లోనూ రాహుల్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేశారు.
కొన్ని రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాల కన్నా తక్కువ అన్న అభిప్రాయాన్ని ఆర్ఎస్ఎస్ వ్యక్తం చేస్తోందన్నారు. కొన్ని భాషల కన్నా.. కొన్ని భాషలు తక్కువే అన్న ఆలోచనవారిదన్నారు. కొన్ని మతాల కన్నా మరికొన్ని మతాలు తక్కువ అన్న అభిప్రాయాలను ఆర్ఎస్ఎస్ వినిపిస్తోందని రాహుల్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

