Road Accident | చంద్రాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
Road Accident | మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులు, కారు ఢీకొట్టుకున్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. బాలిక గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
Road Accident | మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులు, కారు ఢీకొట్టుకున్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. బాలిక గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నాగ్‌భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. నాగ్‌పూర్ నుంచి నాగ్‌భిడ్‌కు కారులో ఆరుగురు వ్యక్తులు బయలుదేరారు. ఈ క్రమంలోనే కారు ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది. కారులోనే నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరిని నాగ్‌భిడ్ గ్రామీణ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారి పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

