Weight Loss | వెయిట్ లాస్ మందులతో కంటిచూపు పోయే ప్రమాదం!
ఒబెసిటీ, డయాబెటిస్ బాధితులకు ఇచ్చే పలు ఔషధాల వల్ల అరుదైన కంటి సమస్య వచ్చే ముప్పు ఉందని వెల్లడైంది.
Weight Loss | న్యూఢిల్లీ: ఒబెసిటీ, డయాబెటిస్ బాధితులకు ఇచ్చే పలు ఔషధాల వల్ల అరుదైన కంటి సమస్య వచ్చే ముప్పు ఉందని వెల్లడైంది. అమెరికాలోని మసాచుసెట్స్ ఐ అండ్ ఇయర్ హాస్పిటల్ పరిశోధకుల బృందం చేసిన ఈ అధ్యయనం వివరాలు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఆప్తమాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
మధుమేహం ఉన్న వారికి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి షుగర్ లెవల్స్ అదుపులో ఉండటానికి ఉపయోగపడేందుకు, ఊబకాయంతో బాధపడుతున్న వారికి బరువు తగ్గేందుకు గానూ ఒజెంపిక్, విగోవి వంటి ఔషధాలను వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.
సెమాగ్లుటైడ్ అనే ప్రొటీన్ ఉన్న ఈ మందులు వాడే ఊబకాయ బాధితులకు మిగతా వారి కంటే ‘నాన్-ఆర్టెరిటిక్ ఆంటీరియర్ ఇషెమిక్ ఆప్టిక్ న్యూరోపతి’ సమస్య వచ్చే అవకాశం ఏడు రెట్లు ఎక్కువ ఉందని పరిశోధకులు గుర్తించారు. మధుమేహ బాధితులకు ఈ ముప్పు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమస్య వల్ల హఠాత్తుగా ఒక కన్ను చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

