Baramulla | కశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. మసీద్‌లో ప్రార్థనలు చేస్తున్న రిటైర్డ్ పోలీస్‌పై కాల్పులు..!
Baramulla | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఆర్మీ వాహనాలపై దాడి చేశారు. తాజాగా బారాముల్లాలోని మసీద్‌లో ప్రార్థనలు చేస్తున్న రిటైర్డ్ పోలీసు అధికారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అజాన్ సందర్భంగా మసీదులో మహ్మద్ షఫీపై కాల్పులు జరుపడంతో మృతి చెందారని పోలీసులు తెలిపారు.
Baramulla | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఆర్మీ వాహనాలపై దాడి చేశారు. తాజాగా బారాముల్లాలోని మసీద్‌లో ప్రార్థనలు చేస్తున్న రిటైర్డ్ పోలీసు అధికారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అజాన్ సందర్భంగా మసీదులో మహ్మద్ షఫీపై కాల్పులు జరుపడంతో మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బారాముల్లాలోని గంట్ముల్లాలో రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ షఫీ మసీదులో అజాన్ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారని కశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపారు. ఇటీవల లోయలో పోలీసులు, బలగాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పుల్వామాతో పాటు జమ్మూకశ్మీర్‌లోని ఇతర ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. శ్రీనగర్‌లోని అన్ని ప్రధాన కూడళ్లలో పాటు ఎగ్జిట్ పాయింట్ల వద్ద మొబైల్ వాహన తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

