తాజా అధ్యయనాల్లో వెల్లడి
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లలతో పోల్చితే నగర, పట్టణ ప్రాంతాల్లో పెరిగే పిల్లలే శ్వాసకోశ సమస్యలతో అధికంగా బాధపడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. మురికివాడల్లో, ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో నివసించే చిన్న పిల్లల్లో ఛాతి ఇన్ఫెక్షన్లు అధికమని మరో సర్వే తెలిపింది. అయితే, ఈ పిల్లలు తల్లిపాలు తాగడం వల్ల ప్రమాదం తీవ్రత తగ్గుతున్నదని వెల్లడైంది. ఈ రెండు అధ్యయనాలు పీడియాట్రిక్ పల్మోనాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి.