పాలక్కాడ్ : ఐఐటీ పాలక్కాడ్‌కి చెందిన పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ చేశారు. మానవ మూత్రంతో పునరుత్పాదక శక్తితో పాటు బయోఫెర్టిలైజర్‌ను ఉత్పత్తి చేసే విధానాన్ని కనిపెట్టారు. మానవ మూత్రాన్ని ఎలక్ట్రోకెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్‌లోకి ప్రవేశపెట్టి, ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్‌కు గురిచేయడం వల్ల విద్యుత్తుతోపాటు బయోఫెర్టిలైజర్స్‌ను ఉత్పత్తి చేయొచ్చని వారు తెలిపారు. సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ అనే ఆన్లైన్ జర్నల్‌లో పరిశోధక బృందం తమ ప్రయోగ విశేషాలను ప్రచురించింది. తమ నూతన ఆవిష్కరణపై పేటెంట్ పొందేందుకు వారు దరఖాస్తు చేసుకున్నారు.