RBI Governor: మూడోసారి మారని రెపో రేటు.. పెరగనున్న ద్రవ్యోల్బణం: ఆర్బీఐ గవర్నర్
RBI Governor : ద్రవ్యోల్బణం మళ్లీ పెరగనున్నది. కూరగాయల ధరల ప్రభావం ద్రవ్యోల్బణంపై పడనున్నది. ద్రవ్యోల్బణ రేటు పెరగనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఇక రెపో రేటును మూడోసారి కూడా పెంచడం లేదని ఆయన స్పష్టం చేశారు.
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్(RBI Governor) శక్తికాంత్ దాస్ ఇవాళ దీనిపై ప్రకటన చేశారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆయన వెల్లడించారు. రెపో రేటును 6.5 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వరుసగా మూడోసారి ఇదే రేటును కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు కూరగాయల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం రేటు పెరగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రెపో రేటును యధాతథంగా ఉంచడానికి ఆర్బీఐ పాలసీ కమిటీ ఏగగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు.
ప్రపంచ మార్కెట్లలో వడిదిడుకులు ఉన్నా.. భారతీయ ఆర్ధిక వ్యవస్థ మాత్రం స్థిరంగా బలపడుతోందన్నారు. భారత మార్కెట్లు 15 శాతం ప్రపంచ ప్రగతికి తోడ్పుడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్ ప్రపంచంలో జరుగుతున్న మార్పుల వల్ల భారత్ లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణ రేటు 5.1 శాతం నుంచి 5.4 శాతానికి పెరగనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ అంచనా వేశారు. మే నెలలో 4.3 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణ రేటు.. జూన్ నెలలో 4.8 శాతానికి చేరుకున్నట్లు వెల్లడించారు. జూలై, ఆగస్టు నెలల్లో ఆ రేటు మరింత పెరిగే ఛాన్సు ఉందని శక్తికాంత్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

