కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్ ఔట్!

- కరోనా చికిత్స నుంచి దీనిని కూడా తీసేయొచ్చు
- దానితో ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు
- గంగారామ్ దవాఖాన చైర్పర్సన్ డీఎస్ రాణా
- ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చిన డబ్ల్యూహెచ్‌వో
న్యూఢిల్లీ, మే 19: కొత్తరూపాలను సంతరించుకుంటున్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవటానికి చికిత్సలో కూడా రోజురోజుకూ నూతన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొవిడ్-19 చికిత్స విధానం నుంచి కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీని తీసివేయాలంటూ ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) ఇటీవల సిఫారసు చేయడం తెలిసిందే. ఇదేక్రమంలో యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డెవిర్ను కూడా త్వరలో తీసివేయవచ్చని ఢిల్లీలోని గంగారామ్ దవాఖాన చైర్పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా అభిప్రాయపడ్డారు. ‘కొవిడ్ చికిత్సకు రెమ్‌డెసివిర్ ఉపయోగపడుతుందనడానికి ఎలాంటి ఆధారంలేదు. కరోనా తీవ్రతను తగ్గించడానికి సాయపడని ఔషధాల వాడకాన్ని కొవిడ్-19 చికిత్స విధానం నుంచి తొలగించాలి’ అని రాణా అభిప్రాయపడ్డారు. ‘ప్లాస్మా థెరపీ లేదా రెమ్‌డెసివిర్‌ను త్వరలో కొవిడ్ చికిత్స జాబితా నుంచి తొలగిస్తారు. కరోనా చికిత్సలో ఈ ఔషధాలు పనిచేస్తున్నట్టు ఆధారాలు లేవు. ప్రస్తుతం కరోనా చికిత్సలో మూడు ఔషధాలు మాత్రమే పనిచేస్తున్నాయి’ అని ఆయన తెలిపారు. అయితే ఆ మూడు ఔషధాల పేర్లను పేర్కొనలేదు. కాగా కరోనా చికిత్సకు రెమ్‌డెసివిర్ సమర్థంగా పనిచేస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా ఇప్పటికే ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

