తప్పుదోవ పట్టించే, రెచ్చగొట్టే వార్తలు ప్రసారం చేయెద్దు… టీవీ ఛానెల్స్‌కు కేంద్రం చురక
న్యూఢిల్లీ: ప్రైవేట్ టీవీ ఛానెల్స్ ధోరణిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జహంగిర్‌పూర్ ప్రాంతంలో హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా జరిగిన ఘర్షణలు, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించి కొన్ని టీవీ ఛానెల్స్ ప్రసారాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, రెచ్చగొట్టేలా హెడ్లైన్లు, వ్యాఖ్యలు చేసిన కొన్ని టీవీ ఛానెల్స్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చురకలు వేసింది. నియమ, నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్న అలాంటి మానుకోవాలని హితవు పలికింది. ‘ఇటీవలి కాలంలో అనేక శాటిలైట్ టీవీ ఛానెల్స్ వార్తా సంఘటనలను అశాస్త్రీయంగా, తప్పుదారి పట్టించేవిగా, సంచలనాత్మకంగా కవరేజీని ప్రసారం చేసినట్లుగా గుర్తించాం. సామాజికంగా ఆమోదయోగ్యం కాని భాష, వ్యాఖ్యలను ఉపయోగించడం, ఇతరుల మర్యాదను కించపరచడం, అసభ్యకరంగా, పరువు నష్టం కలిగించేలా, మతపరమైన వ్యక్తీకరణలు వంటివి ప్రోగ్రామ్ కోడ్‌తోపాటు ది కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (నియంత్రణ) చట్టం 1995 సెక్షన్ 20లోని సబ్ సెక్షన్ (2) నిబంధనలను ఉల్లంఘించినట్లుగా కనిపిస్తున్నాయి’ అని పేర్కొంది.
హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఇటీవల జరిగిన మత ఘర్షణలపై టీవీ ఛానెళ్ల కవరేజీని కేంద్రం ఈ మేరకు ఉదాహరించింది. ప్రజలను రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్న హెడ్‌లైన్స్, వ్యాఖ్యలు, హింసాత్మక వీడియోలు, సామాజికంగా ఆమోదయోగ్యం కాని భాష, మతపరమైన వ్యాఖ్యలు, సంబంధిత అంశాలపై టీవీ ఛానెల్స్‌లో చర్చలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటివి వీక్షకులపై ప్రతికూల మానసిక ప్రభావాన్ని చూపుతాయని, మత సామరస్యాన్ని ప్రేరేపిస్తాయని, శాంతికి విఘాతం కలిగిస్తాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
మరోవైపు టీవీ ఛానెల్స్‌లో ప్రసారమైన ఉక్రెయిన్ యుద్ధం కవరేజీపైనా కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేసింది. ‘కొన్ని ఛానెల్స్ తప్పుడు వాదనలు చేస్తున్నాయి. అంతర్జాతీయ ఏజెన్సీలు, ప్రముఖులను తప్పుగా ఉటంకించడం గమనించాం. వార్తాంశాలతో పూర్తిగా సంబంధం లేని ‘స్కాండలస్ హెడ్లైన్లు, ట్యాగ్లైన్లను’ ఉపయోగిస్తున్నాయి’ అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. చాలా మంది జర్నలిస్టులు, టీవీ యాంకర్లు వీక్షకులను రెచ్చగొట్టేలా కల్పితంగా, అతిశయోక్తితో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. సంబంధిత నియమ, నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్న వీటిని మానుకోవాలని, జాగ్రత్త వహించాలని ఒక ప్రకటనలో గట్టిగా సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

