Adhir takes on Mamata | పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. గతంలో కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నదెవరని నిలదీశారు. ఎన్డీఏ సర్కార్‌లో క్యాబినెట్ మంత్రిగా పని చేసిన మమతా బెనర్జీ విపక్షాల మధ్య ఐక్యతకు ఎలా కృషి చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఆదివారం వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ వల్లే ప్రధాని నరేంద్రమోదీ శక్తిమంతుడయ్యారని మమతా బెనర్జీ శనివారం ఆరోపించారు. ఎల్లవేళలా బీజేపీకి మద్దతు ఇచ్చిన మమతా బెనర్జీ.. బీజేపీ ఏజంట్‌గా పని చేస్తున్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో ఎన్డీయే క్యాబినెట్లో మంత్రిగా పని చేసిన మమతా బెనర్జీ.. ఎల్లవేళలా ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.