వైద్య రంగానికి అండగా..

- రూ.50 వేల కోట్ల ప్రత్యేక నిధులు
- వ్యక్తిగత, చిన్న తరహా రుణాలపై రెండేండ్ల మారటోరియం
- కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆర్బీఐ చర్యలు
ముంబై, మే 5: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నదని రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన వ్యక్తిగత రుణాలతోపాటు చిన్న తరహా పరిశ్రమల రుణాలపై రెండేండ్లు మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్య రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, వ్యాక్సిన్ తయారీదారులకు రుణాల మంజూరులో ప్రాధాన్యమివ్వాలని బ్యాంకులకు సూచించింది. అంతేకాకుండా కొవిడ్ సంబంధ వైద్య విభాగాలకు అండగా నిలిచేందుకు రూ.50 వేల కోట్ల ప్రత్యేక నిధులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. బ్యాంకులు ఈ నిధులను వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు, దవాఖానల్లో వైద్య సదుపాయాల మెరుగుదలకు రుణాలుగా ఇవ్వొచ్చని తెలిపారు. మూడేండ్ల వరకు కాలపరిమితిని కలిగి ఉండే ఈ రుణ పథకం కింద బ్యాంకులు ప్రత్యేకంగా ‘కొవిడ్ లోన్ బుక్’ను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.
చిన్న తరహా రుణ సంస్థలకు రూ.10 వేల కోట్లు
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు (ఎస్ఎఫ్బీ)లకు రూ.10 వేల కోట్ల దీర్ఘకాలిక రుణాలను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. గతేడాది రుణ పునర్వ్యవస్థీకరణ సదుపాయాన్ని వినియోగించుకోనివారు రెండేండ్లపాటు మారటోరియంను పొందే అవకాశం కల్పిస్తున్నామని, రూ.25 కోట్లలోపు రుణాలున్నవారికి ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం భారత్ వద్ద 588 బిలియన్ డాలర్ల (రూ.43,40,116 కోట్ల) విలువైన విదేశీ మారకద్రవ్య నిల్వలున్నాయని, వీటితో సంక్షోభాలను ఎదుర్కోగలిగే శక్తి లభిస్తుందని చెప్పారు.
రాష్ర్టాల ఓడీ గడువు పెంపు
రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వు బ్యాంక్ శుభవార్తను అందించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ఓవర్ డ్రాఫ్ట్(ఓడీ) సదుపాయాలను మరింత సరళతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు 36 రోజులుగా ఉన్న ఓడీ గడువును 50 రోజులకు పొడిగించినట్లు శక్తికాంత దాస్ తాజాగా ప్రకటించారు. దీంతో కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరట లభించినట్లు అవుతున్నది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసినందున గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగి ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కేవైసీ నిబంధనల సడలింపు
మరోవైపు కేవైసీ నిబంధనలను ఆర్బీఐ సడలించింది. ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు కేవైసీ వివరాలను సమర్పించడంలో విఫలమైన కస్టమర్లపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రొప్రైటర్షిప్ సంస్థలు, ఆథరైజ్డ్ సిగ్నేటరీల్లాంటి కొత్త క్యాటగిరీలకు చెందిన కస్టమర్ల సౌలభ్యం కోసం వీడియో కేవైసీ లేదా వీ-సిప్ పరిధిని పెంచాలని కూడా ఆర్బీఐ నిర్ణయించింది.
ఆర్బీఐ నిర్ణయాల్లోని ముఖ్యాంశాలు
- కొవిడ్ సంబంధ వైద్య విభాగాలకు రూ.50 వేల కోట్ల ప్రత్యేక నిధులు.
- వ్యక్తిగత, చిన్న తరహా పరిశ్రమల రుణాలపై రెండేండ్ల మారటోరియం.
- సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలతోపాటు అసంఘటిత రంగంలోని సంస్థలకు మరింత సహకారం.
- ప్రాధాన్య రంగంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల గుర్తింపు.
- ప్రస్తుత రెపో రేటుతో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు రూ.10 వేల కోట్ల దీర్ఘకాలిక రుణాలు.
- రాష్ట్ర ప్రభుత్వాలకు ఓవర్ డ్రాఫ్ట్ గడువు 36 రోజుల నుంచి 50 రోజులకు పొడిగింపు.
- కేవైసీ అప్డేషన్ గడువు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పెంపు.
- రెండో విడతగా ఈ నెల 20న రూ.35 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- corona
- moratorium
- rbi
- second wave
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

