Super Blue Moon | రేపు వినీలాకాశంలో కనువిందు చేయనున్న సూపర్ బ్లూమూన్..!
Super Blue Moon | వినీలాకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. సోమవారం సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం కాబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్ మూన్స్ ఏర్పడుతుంటాయి. బ్లూ మూన్ మాత్రం అరుదుగా ఏర్పడుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పేర్కొంది.
Super Blue Moon | వినీలాకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. సోమవారం సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం కాబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్ మూన్స్ ఏర్పడుతుంటాయి. బ్లూ మూన్ మాత్రం అరుదుగా ఏర్పడుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పేర్కొంది. అయితే, ఈ సారి మాత్రం సూపర్ మూన్, బ్లూ మూన్ కలయికలో సూపర్ బ్లూ మూన్ దర్శనం ఇవ్వబోతున్నది. పౌర్ణమి గడియల్లో చందమామ 90శాతం భూమికి దగ్గరగా వచ్చిన సూపర్ మూన్ ఆవిష్కృతమవుతుంది. దాంతో సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతం ఉండడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. నాలుగు పౌర్ణమిలలో మూడో పౌర్ణమి రోజున బ్లూ మూన్ ఏర్పడుతుంది. అయితే, బ్లూ మూన్ అంటే నీలం రంగులో మాత్రం కనిపించదు.
కానీ, సాధారణంగా బ్లూ మూన్ అని పిలుస్తుంటారు. సూపర్ మూన్, బ్లూ మూన్ రెండూ ఒకేసారి రావడం అరుదుగా జరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ సారి సూపర్ బ్లూ మూన్ అనేది భారతీయులకు ఎంతో ముఖ్యమైన రాఖీ పండుగ రోజున రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే, 1979లో రిచర్డ్ నోల్లెచే సూపర్ మూన్ అనే పదాన్ని పరిచయం చేశారు. 2024లో వరుసగా సూపర్ మూన్‌లు ఆవిష్కరం కాబోతున్నాయి. ఇందులో రాఖీ పండుగ రోజున ఒకటి దర్శనం ఇవ్వనుండగా.. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లోనూ సూపర్ మూన్‌లో కనిపించనున్నాయి. పౌర్ణమి రోజు 25శాతం సూపర్ మూన్‌లు ఏర్పడితే 3శాతం మాత్రమే బ్లూ మూన్స్ ఆవిష్కృతమవుతాయి. ఇక ఈ రెండింటి కలయికలో ఇంకా అరుదుగా వస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మళ్లీ సూపర్ మూన్, బ్లూ మూన్ రెండింటి కలయికలో 2037 సంవత్సరంలో దర్శనం ఇచ్చే అవకాశం ఉందని అంచనా. నాసా ప్రకారం అప్పుడప్పడు పొగ, ధూళి తదితర చిన్న చిన్న కణాలు కాంతి ఎరుపు తరంగ ధైర్ఘ్యాలను చెదరగొడుతుంటాయి. దాంతో చంద్రుడు నీలం రంగులో కనిపిస్తాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRTU Won | యూనియన్ ఎన్నికల్లో బీఆర్టీయూ ఘన విజయం
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి హాజరు
‘ఏఐటీయూసీ పోరాట ఫలితం.. పీవీకే-5 కార్మికులకు సర్ఫేస్ కన్వర్షన్’
Out Side Food | బయటి ఆహారం తక్కువగా తినాలి లేదా పూర్తిగా మానేయాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Rajnath Singh | ముప్పు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. సైన్యానికి రక్షణ మంత్రి పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

