Ramkrishna Matt : రామకృష్ణ మఠంలో వేసవి శిబిరాలు.. ఇదీ షెడ్యూల్
Ramkrishna Matt : రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ సంస్కార్ - 2024 పేరిట నాలుగో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తుంది. నాలుగు నుంచి ఏడో తరగతి వరకు చదివే విద్యార్థులకు జరిగే శిక్షణా శిబిరం ఏప్రిల్ 29న ప్రారంభమై మే 10న ముగుస్తాయి.
హైదరాబాద్: రామకృష్ణ మఠాని(Ramkrishna Matt)కి చెందిన ‘వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ సంస్కార్ – 2024 పేరిట నాలుగో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తుంది. నాలుగు నుంచి ఏడో తరగతి వరకు చదివే విద్యార్థులకు జరిగే శిక్షణా శిబిరం ఏప్రిల్ 29న ప్రారంభమై మే 10న ముగుస్తాయి. 12 రోజుల పాటు ఉదయం 8.30గం.ల నుంచి మధ్యాహ్నం 12.00 గం.ల వరకు జరగనున్నాయి. అలాగే 8, 9, 10వ తరగతుల వారికి మే 14 నుంచి మే 25 వరకు క్లాసులు జరగనున్నాయి. ఇవి కూడా 12 రోజుల పాటు ఉదయం 8.30గం.ల నుంచి మధ్యాహ్నం 12.00 గం.ల వరకు జరగనున్నాయి. వెబ్ సైట్లో సంబంధిత కోర్సు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వీఐహెచ్ఈ తెలిపింది. ఏప్రిల్ 28న ప్రారంభ కార్యక్రమం జరగనుంది.
ఏప్రిల్ 15 – 25 వరకు 12 రోజుల పాటు శ్రద్ధ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఇంటర్ విద్యార్థులు.. 11, 12 తరగతులకు చెందిన వారు అర్హులు. 12వ తరగతి ఫైనల్ పరీక్షలు రాసిన వారు కూడా అర్హులే. వీరికి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు తరగతులు ఉంటాయి.
ఈ శిబిరంలో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసేలా స్వామిజీలు శిక్షణ ఇవ్వనున్నారు. మరిన్ని వివరాలకు వాట్సాప్ నంబర్ 9177232696 లో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

