Baba Ramdev | మహిళల వస్త్రధారణపై తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ క్షమాపణలు చెప్పారు. మహారాష్ట్రలోని థాణెలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళల పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సైన్స్ శిబిరం, మహిళల సదస్సులో పాల్గొన్న ఆయన ‘బట్టలు లేకపోయినా మహిళలు బాగానే ఉంటారు’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. మహిళా సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బాబా రాందేవ్ క్షమాపణలు కోరారు.
మహిళల్ని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే అందుకు తనని క్షమించాలని కోరారు. ఈ మేరకు బాబా రాందేవ్ క్షమాపణలు కోరినట్లు మహారాష్ట్ర కమిషన్ ఛైర్పర్సన్ రూపాలి చకాల్కర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. క్షమాపణలు కోరుతూ రాందేవ్ బాబా పంపిన లేఖను కూడా పోస్టుకు జతచేశారు. మహిళల సాధికారత కోసం, వారి గౌరవం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని బాబా రాందేవ్ తన లేఖలో పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు.
बाबा रामदेव उर्फ राम किसन यादव यांनी ठाणे येथील एका सार्वजानिक कार्यक्रमात महिलांसंबंधी अत्यंत खालच्या पातळीवर जाऊन विधान केले होते. या वक्तव्याची राज्य महिला आयोगाने गंभीर दखल घेत बाबा रामदेव उर्फ राम किसन यादव यांना याबाबतीत आपला खुलासा दोन दिवसाच्या आत सादर करण्यासाठी नोटिस१/२ pic.twitter.com/umI27luSK7
— Rupali Chakankar (@ChakankarSpeaks) November 28, 2022