Ramasetu | రామేశ్వరం నుంచి శ్రీలంకకు కొత్తగా మరో ‘రామసేతు’.. కేంద్రం కసరత్తు..!
Ram Setu | దేశంలో పర్యాటక రంగాన్ని పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా భారత్-శ్రీలంక మధ్య కొత్తగా వంతెనను నిర్మించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తున్నది.
Ram Setu | దేశంలో పర్యాటక రంగాన్ని పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా భారత్-శ్రీలంక మధ్య కొత్తగా వంతెనను నిర్మించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ వంతెనను భారత్‌లోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ను కలిపేలా ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నది. సముద్రంపై 23 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామేశ్వరం నుంచి శ్రీలంక మధ్య రామసేతు వారధి ఉన్న విషయం తెలిసిందే. కొత్త రామసేతు, ధనుష్కోడి.. తలైమన్నార్- శ్రీలంక పాల్క్ జలసంధిని కలుపుతూ 23 కిలోమీటర్ల పొడువున రోడ్డు, రైలు మార్గం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. రూ.40వేలకోట్లతో రామసేతు ప్రాజెక్టును కేంద్రంలోని త్వరలో ప్రారంభించడానికి సాధ్యాసాధ్యాలపై ఎన్హెచ్ఏఐ ద్వారా అధ్యయనం చేయనున్నది. 2022 జులైలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రింకోమలి, కొలంబో ఓడరేవుల అభివృద్ధి చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి భారతదేశం, శ్రీలంక అంగీకరించాయి.
ఆ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై చర్చించింది. ఈ సమయంలోనే విదేశాంగ మంత్రిత్వ శాఖ వంతెన సాధ్యాసాధ్యాల అధ్యయనానికి సంబంధించి నివేదిక తయారు చేయాలని చెప్పింది. వంతెన ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడుతాయని భావిస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు సాంకేతికత, ఆర్థిక, పర్యావరణం తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. డిసెంబర్ 2015లో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విక్రమసింఘేతో రోడ్డు, రైలు వంతెనలను నిర్మించే ప్రణాళికపై చర్చించారు.
ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తమిళనాడులో పర్యటించారు. ధనుష్కోడిని సైతం సందర్శించారు. కోదండ రామస్వామి ఆలయాన్ని దర్శించి.. పూజలు చేశారు. ధనుష్కోడి సమీపంలో ఉన్న అరిచల్ మునైని సైతం సందర్శించారు. తమిళనాడులోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. రామేశ్వరంలోని అగ్నితీర్థం బీచ్ వద్ద సముద్రంలో స్నానమాచరించిన ప్రధాని, రామనాథస్వామి ఆలయంలో పూజలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

