అది హత్య కాదు..చర్యకు ప్రతిచర్యే: బీజేపీ కార్యకర్తల మృతిపై రాకేష్ తికాయత్

న్యూఢిల్లీ : బీకేయూ నేత రాకేష్ తికాయత్ శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లఖింపూర్ ఖేరీలో బీజేపీ కార్యకర్తలపై మూకదాడిని తాను హత్యలుగా పరిగణించనని ఆయన వ్యాఖ్యానించారు. ఇది చర్యకు ప్రతీకారంగా జరిగిన ప్రతిచర్యగా ఆయన అభివర్ణించారు. లఖింపూర్ ఖేరిలో నిరసనకు దిగిన రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు చెందిన వాహనంగా భావిస్తున్న ఎస్యూవీ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన నేపధ్యంలో ఆగ్రహంతో ఊగిపోయిన రైతుల దాడిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు మరణించారు.
రైతులపై కార్ల కాన్వాయ్ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన తర్వాత దానికి ప్రతిగా రైతులు స్పందించారని, బీజేపీ కార్యకర్తలను చావబాదిన వారిని తాను దోషులుగా చూడనని రాకేష్ తికాయత్ స్పష్టం చేశారు. రోడ్డుపై రెండు వాహనాలు ఢీ కొంటే వారు ఘర్షణకు తలపడుతుండటం మీరు చూస్తుంటారు..లఖింపూర్ ఖేరిలో జరిగింది కూడా అదేనని ఆయన చెప్పుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

