Jagdeep Dhankhar: వకీలు కాకపోతే.. యాక్టర్‌ను అయ్యేవాడిని: రాజ్యసభ చైర్మెన్
Jagdeep Dhankar:ఫన్నీ పంచ్‌లతో రాజ్యసభ చైర్మన్ ఆకట్టుకుంటున్నారు. ఇవాళ వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతున్న సమయంలో ఆయన తన చమత్కారాన్ని ప్రదర్శించారు. ఓ సందర్భంలో మాట్లాడుతూ వకీలును కాకపోతే.. యాక్టర్‌ను అయ్యేవాడినన్నారు.
న్యూఢిల్లీ: ఆస్కార్ అవార్డులు గెలిచిన చిత్రాలకు నివాళి అర్పిస్తూ .. ఇవాళ రాజ్యసభ(Rajya Sabha)లో చైర్మెన్ జగదీప్ ధన్కర్(Jagdeep Dhankhar) మాట్లాడారు. ఆర్ఆర్ఆర్(RRR) చిత్రంలోని నాటు నాటు పాట, ద ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రాలకు ఆస్కార్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే సినీ ట్యాలెంట్‌ను మెచ్చుకుంటూ సభ్యులు మాట్లాడుతున్న సమయంలో.. చైర్మెన్ జగదీప్ ఓ ఫన్నీ కామెంట్(funny comment) చేశారు.
అడపాదడపా చమత్కారాలు వదులుతున్న చైర్మెన్.. ఆస్కార్ విజేతలకు తమిళనాడు ఎంపీ వైకో(Vaiko) విషెస్ చెబుతున్న సమయంలో ఓ పంచ్ వేశారు. ఒకవేళ తాను వకీలు(lawyer) కాకుంటే, అప్పుడు కచ్చితంగా యాక్టర్‌ను అయ్యేవాడినని అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతున్న సమయంలో.. చైర్మన్ జగదీప్ వేస్తున్న పంచ్‌లు సభలో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
జయాబచ్చన్(Jaya Bachan) మాట్లాడుతున్న సమయంలో.. బీజేపీ సభ్యులు అల్లరి చేశారు. ఆ సమయంలో జయా కొంత ఆగ్రహానికి గురయ్యారు. అప్పుడు ఆమెను జగదీప్ మెచ్చుకున్న తీరు ఆమెను స్టన్ చేసింది. గొప్ప కుటుంబంలో పుట్టిన మీకు.. క్రియేటివిటీ మీ డీఎన్ఏలోనే ఉందంటూ ఆయన కామెంట్ చేశారు. ఆ పంచ్‌కు జయా కూడా కౌంటర్ ఇవ్వలేకపోయారు.
బెంగాల్ గవర్నర్‌గా చేసిన ధనకర్.. ఆ రాష్ట్రానికి చెందిన ఓ ఎంపీ మాట్లాడుతున్న సమయంలో మనది పురానా రిస్తా అంటూ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో ఆకర్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- actor
- Jagdeep Dhankar
- lawyer
- oscars
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

