Rajasthan: భార్యను బైక్‌కు కట్టేసి ఊరంతా లాక్కెళ్లాడు.. వ్యక్తి అరెస్టు
Rajasthan: మద్యం మత్తులో భార్యను బైక్‌కు కట్టేసి.. ఊరంతా లాక్కెళ్లిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. నగౌర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. దీంతో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.
జైపూర్: మద్యం మత్తులో భార్యను బైక్‌కు కట్టేసి.. ఊరంతా లాక్కెళ్లిన ఘటన రాజస్థాన్(Rajasthan)లో జరిగింది. నగౌర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. దీంతో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. నార్సింగపూర్ గ్రామంలో నెల రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు పాంచౌడి పోలీసు స్టేషన్ ఎస్ఐ సురేంద్ర కుమార్ తెలిపారు. బైక్‌కు భార్య కట్టడానికి ముందు ఆమెను భర్త తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. బైక్‌కు కట్టేసిన తర్వాత ఆమెను లాక్కెళ్లాడు. వీడియో ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ మహిళ బంధువుల వద్ద ఉంటోంది. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నిందితుడు మేఘవాల్ తాగుబోతు అని, ఎప్పుడూ భార్యను కొట్టేవాడని సాక్ష్యులు తెలిపారు. ఎవరితోనూ ఆమె మాట్లాడనివ్వకుండా చేసేవాడని గ్రామస్థులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

