Karni Sena Chief | కర్ణి సేన చీఫ్ హంతకులను ఎన్కౌంటర్ చేయాలి : కాంగ్రెస్ నేత
శ్రీ రాష్ట్రీయ రాజ్పుట్ కర్ణిసేన చీఫ్ (Karni Sena Chief) సుఖ్ధేవ్ సింగ్‌ను చంపిన హంతకులను ఎన్కౌంటర్లో హతమార్చాలని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ కచరియవ బుధవారం డిమాండ్ చేశారు.
జైపూర్ : శ్రీ రాష్ట్రీయ రాజ్పుట్ కర్ణిసేన చీఫ్ (Karni Sena Chief) సుఖ్ధేవ్ సింగ్‌ను చంపిన హంతకులను ఎన్కౌంటర్లో హతమార్చాలని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ కచరియవ బుధవారం డిమాండ్ చేశారు. ఇది తీవ్ర పరిస్ధితని, సుఖ్ధేవ్ సింగ్ హంతకులను ఎన్కౌంటర్లో మట్టుబెట్టాలని కచరియవ పేర్కొన్నారు. ప్రజలంతా శాంతితో సంయమనంగా వ్యవహరించాలని కోరారు.
కాగా, రాష్ట్రీయ రాజ్పుట్ కర్ణి సేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు నిరసనగా కర్ణిసేన, ఇతర గ్రూపులు బుధవారం రాజస్ధాన్ బంద్‌కు (Rajasthan Bandh Call) పిలుపు ఇచ్చాయి. బంద్ పిలుపులో భాగంగా కర్ణి సేన శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. సుఖ్ధేవ్ సింగ్ హత్యోదంతంపై న్యాయ విచారణ జరిపించాలని కర్ణి సేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. సుఖ్ధేవ్ సింగ్‌కు భద్రత కల్పించాలని కోరామని, ఇలాంటి ఘటన జరుగుతుందనే ఆందోళనతో ప్రభుత్వానికి లేఖలు రాశారని, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కర్ణి సేన వ్యవస్ధాపకుడు లోకేంద్ర సింగ్ కల్వి కుమారుడు భవాని సింగ్ కల్వి వివరించారు.
సుఖ్ధేవ్ సింగ్‌కు ఎందుకు భద్రత కల్పించలేదనేది ప్రశ్నార్ధకంగా మారిందని అన్నారు.ఈ ఘటనపై అసెంబ్లీకి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే దియా కుమారి స్పందిస్తూ కర్ణిసేన చీఫ్ హత్య దిగ్భ్రాంతికి లోనుచేసిందని అన్నారు. ఈ ఘటనను ఖండించేందుకు తనకు మాటలు రావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. సుఖ్ధేవ్ సింగ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని అన్నారు. సుఖ్ధేవ్ సింగ్‌ను మంగళవారం జైపూర్‌లోని ఆయన నివాసంలో సాయుధ దుండగులు కాల్చిచంపిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Read More :
Cyclone Michaung | మిచౌంగ్ తుఫాన్ బీభత్సం.. చెన్నై ప్రజలకు డేవిడ్ వార్నర్ విజ్ఞప్తి!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

