సాధారణం కంటే 42% తక్కువగా వర్షపాతం
భారతదేశ వ్యాప్తంగా జూన్ నెలలో వర్షపాతం సాధారణం కంటే 42 శాతం తక్కువగా నమోదైంది. గత దశాబ్దన్నర కాలంలో వేసవి రుతు పవనాలకు ఇది అత్యంత బలహీనమైన ఆరంభం.
న్యూఢిల్లీ, జూన్ 29: భారతదేశ వ్యాప్తంగా జూన్ నెలలో వర్షపాతం సాధారణం కంటే 42 శాతం తక్కువగా నమోదైంది. గత దశాబ్దన్నర కాలంలో వేసవి రుతు పవనాలకు ఇది అత్యంత బలహీనమైన ఆరంభం. దీని ఫలితంగా దేశంలోని 76 శాతం ప్రాంతాల్లో వర్షపాతం ‘లోటు’, లేదా ‘తీవ్ర లోటు’గా ఉంది. జూలై కూడా సాధారణం కంటే పొడిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాగునీరు, తాగునీటి కోసం పర్యవేక్షించే దేశంలోని 166 ప్రధాన జలాశయాలు జూన్ 25 నాటికి మొత్తం నిల్వ సామర్థ్యంలో 26 శాతాన్ని కలిగి ఉన్నాయి. నీటి మట్టాలు ఇందిరా సాగర్‌లో 14 శాతానికి, నాగార్జున సాగర్‌లో 5 శాతానికి, తెహ్రీలో 2 శాతానికి పడిపోయాయి. పసిఫిక్‌లో పెరుగుతున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల(ఎల్ నినో అనే పరిస్థితి) కారణంగా ఆ నెలలో రుతుపవన వర్షపాతం మళ్లీ పుంజుకున్నప్పటికీ జూలై నెలలో చాలావరకు వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఐరోపాలో వడగాడ్పులు
తన చరిత్రలోనే ఐరోపా అత్యంత తీవ్రమైన వడడ్పులను ఎదుర్కొంటున్న తరుణంలో భారత రుతుపవనాలు బలహీనపడ్డాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఇంగ్లండ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కాలానుగుణ సగటు కంటే 5 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర ఆఫ్రికా నుండి వేడి గాలిని రప్పించే స్థిరమైన అధిక పీడన వ్యవస్థ కారణంగా ఏర్పడిన వడగాడ్పులు మానవ ప్రేరిత వాతావరణ మార్పుల వల్ల మరింత తీవ్రమయ్యాయని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ అనే బహుళ దేశాల పరిశోధక బృందం శుక్రవారం తెలిపింది. ఐరోపా వేసవి వాతావరణంపై ఎల్ నినో ప్రభావం పరిమితంగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది భారత రుతుపవనాలపై ఇది ప్రధాన ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

