న్యూఢిల్లీ, అక్టోబర్ 26: చెక్ రిపబ్లిక్కు చెందిన టీవీ వ్యాఖ్యాత, సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కామిల్ బర్తోషెక్ ‘వన్‌మ్యాన్ షో ది మూవీ’ అనే సినిమాలో నటించాడు. సిని మా ప్రమోషన్లో భాగంగా యూజర్ల కోసం ఓ పోటీని నిర్వహించాడు. సినిమాలో ఉన్న పజిల్‌ను పరిష్కరించిన మొదటి వ్యక్తికి లక్ష డాలర్ల బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఏ ఒక్కరూ పజిల్‌ను పరిష్కరించకపోయేసరికి, వారందర్నీ ఓ ప్రాంతానికి పిలిచి.. నగదు మొత్తాన్ని హెలిక్యాప్టర్ ద్వారా జారవిడిచాడు.