Rahul Mamkootathil | లైంగిక ఆరోపణలు.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా
Rahul Mamkootathil | మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపుల (Mollywood) ఆరోపణలు మరోసారి కలకలం రేపాయి.
Rahul Mamkootathil | మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపుల (Mollywood) ఆరోపణలు మరోసారి కలకలం రేపాయి. ఓ యువ రాజకీయ నాయకుడు (youth leader) తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ నటి (Malayalam Actor), మాజీ జర్నలిస్ట్ రిని ఆన్ జార్జ్ (Rini Ann George) ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, ఆ నాయకుడు ఎవరన్నది ఆమె క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ మాత్రం ఆ యువ రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాహుల్ మమ్కూతతిల్(Rahul Mamkootathil)గా తెలిపింది. ఈ ఆరోపణలతో రాహుల్ కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాపై ఎలాంటి ఒత్తిడీ లేదని, వ్యక్తిగత బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఓ ఇంటర్వ్యూలో రిని ఆన్ జార్జ్ మాట్లాడుతూ.. ఓ యువ రాజకీయ నాయకుడు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ రిని ఆన్ జార్జ్ ఆరోపించింది. ఫైవ్‌స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేశాను రమ్మంటూ అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఆ యువ నాయకుడు ఎవరన్నది మాత్రం చెప్పలేదు. పేరు, పార్టీ వంటి వివరాలు చెప్పేందుకు ఆమె నిరాకరించింది. ఆ తర్వాత రచయిత్రి హనీ భాస్కరన్ (Honey Bhaskaran) కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. అందులో మమ్కూతతిల్ పేరును ప్రస్తావించారు. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, పదేపదే అభ్యంతరకర మెసేజ్‌లు పంపారంటూ ఆరోపించారు. యూత్ కాంగ్రెస్‌లో ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చాయిని చెప్పారు. కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని హనీ భాస్కరన్ ఆరోపించారు.
Also Read..
Malayalam Actress | హోటల్‌కి రమ్మన్నాడు.. యువ రాజకీయ నాయకుడిపై ప్రముఖ నటి లైంగిక ఆరోపణలు
Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖాగుప్తాకు భద్రత పెంపు.. Z-కేటగిరీ సెక్యూరిటీ
Sudershan Reddy | ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

