కోజికోడ్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కేరళలో మోకాలి నొప్పికి చికిత్స చేయించుకుంటున్నట్లు తెలిసింది. మోకాలి నొప్పికి చికిత్స కోసం రాహుల్‌గాంధీ ఈ నెల 21న కొత్తక్కల్ ఆర్య వైద్యశాలలో చేరారని పేరు చెప్పడానికి ఇష్టపడని కేరళ కాంగ్రెస్ నాయకుడు ఒకరు మీడియాకు వెల్లడించారు. కోజికోడ్‌లో ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడిన ఆయన జూలై 30న రాహుల్‌గాంధీ వైద్యశాల డిశ్చార్జి అవుతారని కూడా వెల్లడించారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించినప్పటి నుంచి రాహుల్‌గాంధీ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గతంలోనే వెల్లడించారు. ప్రస్తుతం కొత్తక్కల్ ఆర్య వైద్యశాలలో రాహుల్గాంధీపాటు కేసీ వేణుగోపాల్ కూడా ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు ఆ పేరు చెప్పని నేత తెలిపారు.