52వ ఏట అడుగుపెట్టిన రాహుల్ గాంధీ.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ శనివారం 52వ ఏట అడుగుపెట్టారు. అయితే కరోనా రెండో దశ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా రాహుల్ గాంధీ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. దేశ వ్యాప్తంగా కరోనా సహాయక చర్యలు కొనసాగించాలని పార్టీ కార్యకర్తలను ఆయన కోరినట్లు శనివారం ట్వీట్ చేసింది. మరోవైపు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ట్విట్టర్లో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్‌ను ప్రియమైన సోదరుడిగా స్టాలిన్ అభివర్ణించారు. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతోపాటు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ దూరదృష్టి ఉన్న నేత, దేశానికి ఆశా కిరణమని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ట్విట్టర్లో పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

