Rahul Gandhi | ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఆ నలుగురికి తప్పక శిక్ష పడుతుంది : రాహుల్ గాంధీ
Rahul Gandhi | భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'ఇండియా కూటమి (INDI Bloc)' ఢిల్లీలో చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. గురువారం సైతం విపక్ష ఎంపీలు తమ ఆందోళనలను కొనసాగించారు.
Rahul Gandhi : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా కూటమి (INDI Bloc)’ ఢిల్లీలో చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. గురువారం సైతం విపక్ష ఎంపీలు తమ ఆందోళనలను కొనసాగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi).. మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, జ్ఞానేశ్ కుమార్లపై తీవ్ర విమర్శలు చేశారు.
ఆ నలుగురూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. వారికి కచ్చితంగా శిక్ష పడుతుందని, అది మీరంతా చూస్తారని, ఇది నా హామీ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. తొలిరోజు తమను ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పారు. రెండోరోజు జంతర్ మంతర్‌కు వెళ్లనివ్వలేదని, ఎంపీలపై దాడి చేశారని తెలిపారు.
నిరసనల్లో భాగంగా విపక్ష ఎంపీలు ఇవాళ తొలుత రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ అంశంపై తదుపరి కార్యాచరణకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో విపక్ష ఎంపీలు భేటీ కానున్నారు. ఇందుకోసం ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణల గురించి రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

