ఈడీ దాడులకు భయపడం : రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ భవనంలోని యంగ్ ఇండియా లిమిటెడ్ కార్యాలయాన్ని ఈడీ సీల్ చేసిన అనంతరం మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీ విమర్శలు గుప్పించారు.
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ భవనంలోని యంగ్ ఇండియా లిమిటెడ్ కార్యాలయాన్ని ఈడీ సీల్ చేసిన అనంతరం మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీ విమర్శలు గుప్పించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు బీజేపీ అణిచివేత ఎత్తుగడల్లో భాగమని, కాషాయ పార్టీకి తాము భయపడబోమని రాహుల్ స్పష్టం చేశారు. బీజేపీ ఏం చేసినా తాము బెదిరేది లేదని అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు తన పోరాటం కొనసాగుతుందని గురువారం పేర్కొన్నారు. తమపై ఒత్తిడి తీసుకువస్తే మౌనం దాల్చుతామని కాషాయ పాలకులు అనుకుంటున్నారని, తాము మౌనం దాల్చబోమని బీజేపీ దుర్నీతిని ఎండగడుతూనే ఉంటామని అన్నారు.
మనీలాండరింగ్ కేసులో భాగంగా కాంగ్రెస్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ భవనంలోని యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఈడీ బుధవారం సీల్ వేసిన నేపధ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా నేషనల్ హెరాల్డ్‌పై ఈడీ దాడులను కాంగ్రెస్ తప్పుపట్టింది. వాస్తవ అంశాలను మరుగునపరిచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వి దుయ్యబట్టారు. నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో ఈడీ దాడుల నేపధ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతా దళాలను పెద్ద ఎత్తున మోహరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
మోదీ సర్కార్ అన్నింటినీ సీల్ వేసే ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. ఇలాంటి చవకబారు ఎత్తుగడలతో కేంద్రం తమ గొంతులను నొక్కలేదని సింఘ్వి పేర్కొన్నారు. విపక్షంగా తమ బాధ్యత నుంచి తాము ఎప్పుడూ పక్కకు తప్పుకోబోమని స్పష్టం చేశారు. మీరు ఎంతగా తమను అణిచివేయాలని చూసినా మీ తప్పిదాలను బయటపెడుతూనే ఉంటామని అన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కక్షపూరిత రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడటం ప్రజాస్వామ్య విధానం కాదని, తాము ఎక్కడికి పారిపోవడం లేదని వారు గుర్తుపెట్టుకోవాలని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

