డ్రాగన్ దుర్నీతి : మోదీ సర్కార్ పై రాహుల్ ఫైర్

న్యూఢిల్లీ : దేశ భద్రతను మోదీ సర్కార్ ప్రమాదంలో పడవేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. చైనాతో చర్చలు దండగమారి ప్రక్రియని వ్యాఖ్యానించారు. గోగ్రా, డెస్పాంగ్ ప్రాంతాల్లో చైనా ఆక్రమణలు భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు పెను సవాల్ గా మారాయని రాహుల్ అభివర్ణించారు. డ్రాగన్ తో అర్ధవంతంగా లేని చర్చలతో దేశ భద్రత ఆందోళనకరంగా మారిందని సోమవారం ఆయన ట్వీట్ చేశారు.
తూర్పు లడఖ్ లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్సాంగ్ ప్రాంతాల నుంచి సేనల ఉపసంహరణకు చైనా విముఖత చూపుతోందన్న వార్తల నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తూర్పు లడఖ్ లో సేనల ఉపసంహరణకు అంగీకరించిన చైనా ఇప్పుడు ఎందుకు నిరాకరిస్తోందని కాంగ్రెస్ నేతలు మోదీ సర్కార్ ను ప్రశ్నించారు. సేనల ఉపసంహరణపై డ్రాగన్ తో జరిపిన చర్చలు ఎందుకు ఫలితాలు ఇవ్వడం లేదని నిలదీశారు. ఈ అంశంపై ప్రభుత్వం విస్పష్ట సమాచారంతో ముందుకురావాలని కాంగ్రెస్ ప్రతినిధి అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

