మోదీ సర్కార్ ఏలుబడిలో సరిహద్దుల్లో అభద్రత : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : అసోం-మిజోరాం సరిహద్దు వివాదం, వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితుల వ్యవహారంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ చేతుల్లో అటు దేశ సరిహద్దులు కానీ ఇటు రాష్ట్ర సరిహద్దులు కానీ భద్రంగా లేవని ఆరోపించారు. ఈ అంశంపై కాషాయ పార్టీ ప్రభుత్వం తీరును రాహుల్ తీవ్రంగా తప్పుపట్టారు.
రెండు ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం చిలికిచిలికి గాలివానగా మారడంతో జులై 26న అల్లర్లకు దారితీయడంతో ఆరుగురు అసోం పోలీసులు, ఓ పౌరుడు మరణించగా 50 మందికి పైగా గాయాలయ్యాయి. అసోం-మిజోరం సరిహద్దుల్లో అల్లర్లు చెలరేగిన ప్రాంతంలో పెద్దసంఖ్యలో సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించినా ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. అసోం బారక్ వ్యాలీ జిల్లాలు కచర్, కరీంగంజ్, హిలాల్కండీలు మిజోరాంలోని ఐజ్వాల్, కొలసిబ్, మమిత్ జిల్లాలతో సరిహద్దు ప్రాంతం విస్తరించి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

