ధర్డ్ వేవ్ ముప్పు : 1.2కు పెరిగిన ఆర్ వ్యాల్యూ!

న్యూఢి్ల్లీ : థర్డ్ వేవ్ ముప్పు తప్పదనే ఆందోళనల నడుమ కరోనా వైరస్ సంక్రమణ వేగాన్ని సూచించే ఆర్-వ్యాల్యూ గత రెండు వారాల్లో 1.2కు ఎగబాకింది. కేరళ, మహారాష్ట్రలో కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఆర్ వ్యాల్యూ అంతకంతకూ పెరుగుతున్నదని తాజా అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు. ఆగస్ట్ 14-17 మధ్య 0.89గా ఉన్న ఆర్ వ్యాల్యూ ఆగస్ట్ 24-29 మధ్య 1.17కు పెరగ్గా ఆగస్ట్ 30 నాటికి ఇది 1.2కు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్(చెన్నై)కు చెందిన పరిశోధకులు వెల్లడించారు.
ఆగస్ట్‌లో కేరళ, మహారాష్ట్ర, మిజోరం, జమ్ము కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఆర్ వ్యాల్యూ 1కి పైగా పెరగడం పరిస్ధితి తీవ్రతకు దారితీస్తోందని పరిశోధకుల బృందానికి నేతృత్వం వహిస్తున్న సితభ్ర సిన్హా చెప్పారు. దేశంలో అత్యధిక యాక్టివ్ కేసులు నమోదైన కేరళలో ఆర్ వ్యాల్యూ 1.33 కాగా, మిజోరంలో 1.36, జమ్ము కశ్మీర్లో 1.25, మహారాష్ట్రలో 1.06, ఏపీలో 1.09గా ఉంది.
కరోనా వైరస్ సోకిన వారు ఎంతమందికి వైరస్‌ను వ్యాప్తి చేస్తారనేది వెల్లడించే సంకేతంగా రీప్రొడక్షన్ నెంబర్ (ఆర్ వ్యాల్యూ)ను పరిగణిస్తారు. సగటు ఆర్ వ్యాల్యూ తక్కువగా ఉంటే వ్యాధి తగ్గుముఖం పడుతున్నట్టు పరిగణిస్తారు. ఆర్ వ్యాల్యూ 1 కంటే ఎక్కువగా ఉంటే వైరస్ సోకే వారు అధికమయ్యే దశను ఎపిడెమిక్ దశగా పిలుస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

