R Praggnanandhaa: క్లాసికల్ చెస్‌లో కార్లసన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
R Praggnanandhaa: క్లాసికల్ చెస్‌లో ప్రజ్ఞానంద క్లాసిక్ విక్టరీ నమోదు చేశాడు. వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్లసన్‌ను ఓడించాడు.
న్యూఢిల్లీ: వరల్డ్ నెంబర్ వన్ చెస్ క్రీడాకారుడు మాగ్నస్ కార్లసన్‌పై ఇండియన్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద (R Praggnanandhaa)విజయం సాధించాడు. నార్వే చెస్ టోర్నమెంట్లో ఆ విక్టరీతో ప్రజ్ఞానంద లీడ్‌లోకి వెళ్లారు. ఇటీవల ర్యాపిడ్ లేదా ఎగ్జిబిషన్ గేమ్స్‌లో పలుమార్లు కార్లసన్‌పై ప్రజ్ఞ గెలుపొందాడు. అయితే ఈ గేమ్‌లో మూడు రౌండ్ల తర్వాత 5.5 పాయింట్లతో లీడింగ్ పొజిషన్లో ఉన్నాడు. ప్రజ్ఞానంద తెలుపు పావులతో మ్యాచ్ ఆడాడు. కార్లసన్‌పై విక్టరీ కొట్టడంతో టోర్నీ ఫెవరేట్ పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి పడిపోయారు. క్లాసికల్ చెస్‌ను స్లో చెస్‌గా కూడా పిలుస్తారు. క్రీడాకారులు ఒక ఎత్తు వేయడానికి తమకు కావాల్సినంత సమయాన్ని తీసుకుంటారు. కనీసం ఒక గంట సమయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫార్మాట్లో గతంలో ఇద్దరి మధ్య జరిగిన మూడు మ్యాచులు డ్రాగా ముగిశాయి. మహిళల విభాగంలో ప్రజ్ఞానంద సోదరి ఆర్ వైశాలి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆమె 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నది. అన్నా ముజిచక్తో జరిగిన మ్యాచ్‌ను ఆమె డ్రాగా ముగించుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

