ఉత్తరాఖండ్ నూతన సీఎం పుష్కర్‌సింగ్ ధామి
Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామి ఎన్నికయ్యారు.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామి ఎన్నికయ్యారు. ఈ మధ్యాహ్నం 3.00 గంటలకు ఉత్తరాఖండ్‌లోని బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్, ఇతర సీనియర్ బీజేపీ నాయకుల సమక్షంలో ఉత్తరాఖండ్ బీజేఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి తమ కొత్త నాయకుడిగా పుష్కర్‌సింగ్ ధామిని ఎన్నుకున్నారు.
బీజేఎల్పీ నేతగా పుష్కర్‌సింగ్ ధామి ఎన్నిక కావడంతో ఇక ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవిని లాంఛనమే కానుంది. గత మార్చిలో సమర్థంగా పనిచేయలేకపోతున్నారనే కారణంతో అప్పటి ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్‌ను పదవి నుంచి తప్పించి తీరథ్ సింగ్ రావత్‌కు ఆ పదవిని అప్పగించింది. అయితే ప్రస్తుతం ఎంపీగా తీరథ్సింగ్ రావత్ సెప్టెంబర్ 10వ తేదీ లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది.
అయితే కరోనా మహమ్మారి విస్తృతి, వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విముఖత వ్యక్తం చేసింది. దాంతో తీరథ్సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయన రాజీనామా చేయడంతో ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామిని ఎన్నుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

