Pappu Yadav | పూర్నియా ఎంపీ పప్పు యాదవ్‌పై ఎఫ్ఐఆర్.. ఎందుకంటే?
బీహార్‌లోని పూర్నియా ఎంపీ పప్పు యాదవ్‌పై (Pappu Yadav) ఎఫ్ఐఆర్ నమోదయింది. ఓ ఫర్నీచర్ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలపై ఆయనపై కేసు రిజిస్టర్ అయింది.
పాట్నా: బీహార్‌లోని పూర్నియా ఎంపీ పప్పు యాదవ్‌పై (Pappu Yadav) ఎఫ్ఐఆర్ నమోదయింది. ఓ ఫర్నీచర్ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలపై ఆయనపై కేసు రిజిస్టర్ అయింది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున (జూన్ 4న) తన ఇంటికి పిలిపించి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడని, లేకపోతే చంపేస్తానని బెదించాడని ఆ వ్యాపారి ఫిర్యాదులో పేర్కొన్నాడు. వచ్చే ఐదేండ్లు తాను ఎంపీగా ఉంటానని హెచ్చరించాడని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో జూన్ 10న పూర్నియా జిల్లా పోలీసులు పప్పు యాదవ్‌పై కేసు ఫైల్ చేశారు.
గతంలో కూడా పప్పు యాదవ్‌పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. 2021, 2023లో కూడా ఇలాగే డిమాండ్ చేశారని పోలీసులు తెలిపారు. అయితే ఈసారి కూడా డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని యాదవ్ బెదిరించడంతో పాటు వచ్చే ఐదేళ్లపాటు ఎంపీతో వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారని చెప్పారు. వ్యాపారి ఫిర్యాదు ఆధారంగా ఎంపీ, అతని సహచరుడు అమిత్ యాదవ్‌పై కూడా కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించామన్నారు.
కాంగ్రెస్ నేత అయిన పప్పు యాదవ్ ఇటీల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పూర్నియా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. రెండుసార్లు ఎంపీగా విజయం సాధించిన జేడీయూ నేత సంతోశ్ కుష్వాహాను ఓడించారు. పొత్తులో భాగంగా పూర్నియా టికెట్‌ను ఆర్జేడీకి ఇచ్చింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకిదిగారు. కాగా, తాను కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతానని, ఇండియా కూటమికే తన మద్దతుని పప్పు యాదవ్ ప్రకటించారు. ఈనేపథ్యంలో జూన్ 10న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీని కలిశారు. దీంతో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య 101కి చేరింది. ఇంతలోనే ఆయనపై కేసు నమోదుకావడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

