న్యూఢిల్లీ : పంజాబ్‌లోని మొహాలీలో ఓ అమ్మాయి మాజీ లవర్ దారుణ హత్య(Lover Stabbed)కు పాల్పడ్డాడు. తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను ఆఫీసులోనే కిరాతంగా చంపేశాడు. తోటి ఉద్యోగుల ముందే ఈ ఘాతుకం జరిగింది. రిలేషన్షిప్ అంశంలో ఇద్దరి మధ్య ఇటీవల గొడవ జరిగినట్లు తెలిసింది. అయితే ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఆ మహిళను ఆమె ఆఫీసుకు వెళ్లి చంపేశాడు. నిందితుడిని హర్విందర్ మాన్ అలియాస్ హ్యారీగా గుర్తించారు. లవర్‌ను పొడిచి చంపిన తర్వాత అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఆఫీసులో అమర్చిన సీసీటీవీ కెమెరాలకు ఈ మర్డర్ దృశ్యాలు చిక్కాయి. గురువారం రాత్రి 7.40 నిమిషాలకు నిందితుడు ఆఫీసులోకి ప్రవేశించాడు. కూర్చీలో కూర్చుని పనిచేస్తున్న తన లవర్ వద్దకు వెళ్లాడు. దింపుల్ అనే మహిళను వెనక నుంచి కత్తితో పొడిచాడు. అతని నుంచి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ జట్టు పట్టుకుని ఆమెను లాగేశాడు. కత్తితో కసిగా పొడిచేశాడు. అక్కడ ఉన్న ఉద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేసినా అతను తగ్గలేదు. డింపుల్‌ను దాదాపు 20 సార్లు పొడిచేశాడతను.
లవర్‌ను పొడిచిన తర్వాత నిందితుడు ఆఫీసులో బాధితురాలు కూర్చున చోటుకు వెళ్లాడు. అక్కడే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గొంతును కోసుకున్నాడు. సుమారు 30 సార్లు కత్తితో పొడుచుకున్నాడు. డింపుల్ సొంతూరు పాటియాలా. అయితే ఇద్దరి మధ్య మూడేళ్ల రిలేషన్ ఉంది. కానీ ఇటీవల ఆ జంట బ్రేకప్ అయ్యింది. అయితే డింపుల్‌తో మళ్లీ మంచి రిలేషన్ కొనసాగించేందుకు హ్యారీ ప్రయత్నించాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. ఆ ఎమోషన్లో ఉన్న హ్యారీ.. ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
#Watch | A woman working at a private company in Punjab’s Mohali was stabbed to death by her colleague – believed to be her ex-boyfriend – in the office after an argument over their relationship status. The accused, identified as Harvinder Mann alias Harry, later attempted to die… pic.twitter.com/dYW3aijIJ5
— NDTV (@ndtv) June 5, 2026