పంజాబ్ యువకులకు ‘ఫస్ట్ గిఫ్ట్’ ఇచ్చిన సీఎం భగవంత్ మాన్
మంత్రివర్గం మొదటి భేటీ తర్వాత.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఓ నెలలోపే 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ల జారీకి కేబినెట్ ఓకే చెప్పింది. పంజాబ్ యువకులకు ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అంటూ సీఎం భగవంత్ మాన్ ట్వీట్ చేశారు.
పంజాబ్‌లో ఇవాళ పది మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులందరూ పంజాబీలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో హర్పాల్ సింగ్ చీమా, హర్భజన్ సింగ్, డాక్టర్ విజయ్ సింఘాలా, లాల్ చాంద్, గుర్మీత్ సింగ్ మీట్ హేయర్, కుల్దీప్ సింగ్ ధాలివాల్, లాల్జిత్ సింగ్ భుల్లార్, బ్రామ్ శంకర్ జింపా, హర్జోత్ సింగ్ బెయిన్స్, డాక్టర్ బల్జీత్ కౌర్‌లు ఉన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర సీఎంగా భగవంత్ మాన్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇవాళ జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

