Birthday Celebration | బర్త్ డేకి దుబాయ్ తీసుకెళ్లట్లేదని భర్త ముఖంపై పిడిగుద్దులు.. ముక్కు పగిలి మృతి
వాళ్లిద్దరిది ప్రేమ వివాహం. వయస్సులో భర్త కంటే ఆమె రెండేండ్లు పెద్దది. అతడు నిర్మాణ రంగంలో బడా వ్యాపారి. ఇంకే డబ్బుకు కొదువేం లేదు.. వారి సంసార జీవితం అంతా సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్నారా.. అదేం లేదు.
పుణె: వాళ్లిద్దరిది ప్రేమ వివాహం. వయస్సులో భర్త కంటే ఆమె రెండేండ్లు పెద్దది. అతడు నిర్మాణ రంగంలో బడా వ్యాపారి. ఇంకే డబ్బుకు కొదువేం లేదు.. వారి సంసార జీవితం అంతా సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్నారా.. అదేం లేదు. వారిద్దరి మధ్య తరచూ గొడవలు. తన పుట్టిన రోజు వేడుకను (Birthday Celebration) దుబాయ్లో (Dubai) జరపాలని తన భర్తను కోరింది. దానికి అతడు తిరస్కరించాడు. దీంతో షరా మామూలే.. లొల్లి స్టార్ట్. అదికాస్తా ముదిరి దెబ్బలాడుకోవడం వరకు వెళ్లింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఆమె.. భర్త ముఖంపై పిడిగుద్దులు గుద్దింది. ఈ క్రమంలో ముక్కుపై బలంగా తాకడంతో తీవ్రంగా గాయపడ్డి చనిపోయాడు. ఇదంతా మహారాష్ట్రలోని పుణెలో (Pune) జరిగింది.
నిఖిల్ ఖన్నా (Nikhil Khanna).. పుణెలో ప్రముఖ వ్యాపారి. ఆ రేండ్ల క్రితం తన కంటే రెండేండ్లు పెద్దదైన రేణుకను (38) ప్రేమించి పెండ్లిచేసుకున్నాడు. అయితే ఏదో ఒక విషయంలో ఇద్దరు తరచూ గొడవలు జరుగుతున్నాయి. అలాగే శుక్రవారం మధ్యహ్నం కూడా ఆలుమగల మధ్య పుట్టినరోజు వేడుక చిచ్చుపెట్టింది. తన పుట్టిన రోజును దుబాయ్లో సెలబ్రేట్ చేసుకుందామని, అక్కడి తీసుకెళ్లాలని నిఖిల్ను కోరింది. అయితే రేణుక (Renuka) అభ్యర్థనను ఆయన తిరస్కరించాడు.
అప్పటికే తన తరఫు బంధువుల ఇండ్లలో జరిగే శుభకార్యాలకు వెళ్లనివ్వడం లేదని, తన పుట్టిన రోజు, పెండ్లి రోజులపుడు ఖరీదైన బహుమతులు ఇవ్వడం లేదని కోపంతో ఉన్న రేణుక.. నిఖిల్తో గొడవకు దిగింది. అదికాస్తా ఘర్షణకు దారితీయండంతో అతని ముఖంపై కొట్టింది. ఈ క్రమంలో అతని మూతి పళ్లు రాలడంతోపాటు ముక్కుపై బలంగా దెబ్బ తగలడంతో తీవ్ర రక్తస్రావం అయింది. చూస్తుండగానే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

