ఢిల్లీలో వెలసిన ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు
Khalistan | దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి, జనక్‌పురి, పశ్చిమ్ విహారి, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో ఖలిస్థాన్ ఏర్పాటుకు అనుకూలంగా గుర్తుతెలియని
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి, జనక్‌పురి, పశ్చిమ్ విహారి, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో ఖలిస్థాన్ ఏర్పాటుకు అనుకూలంగా గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. సిక్కులకు న్యాయం చేయాలి, ఖలిస్థానీ జిందాబాద్, రెఫరెండం 2020 అనే నినాదాలను ఆ పోస్టర్లపై రాశారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు, ఉగ్రవాద నిరోధక విభాగం అధికారులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అయితే గణతంత్ర దినోత్రదినోత్సవ వేడుకల వేళ దేశ రాజధానిలో వేర్పాటువాద పోస్టర్లు, జెండాలు కన్పించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ కోసం కంటెంజెంట్లు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 23న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 6.30 నుంచి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కర్తవ్యపథ్‌ను మూసివేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

