CM Vijay: సీఎం విజయ్‌పై అభ్యంతరకర పోస్టు.. ప్రైవేట్ ఉద్యోగి అరెస్టు
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్‌పై అభ్యంతరకర కాంటెంట్‌ను ప్రచారం చేస్తున్న ప్రైవేట్ఉద్యోగిని అరెస్టు చేశారు. కోయంబత్తూరు జిల్లాలోని సూలూరులో జరిగిన పదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసు అంశంలో ప్రైవేట్ సంస్థ ఉద్యోగి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్(CM Vijay)పై అభ్యంతరకర కాంటెంట్‌ను ప్రచారం చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగిని అరెస్టు చేశారు. కోయంబత్తూరు జిల్లాలోని సూలూరులో జరిగిన పదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసు అంశంలో ప్రైవేట్ సంస్థ ఉద్యోగి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలిక హత్యా ఘటన తమిళనాడులో తీవ్ర దుమారం రేపుతున్నది. ఈ ఘటనతో లింకున్న కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. వారిని కార్తీ, మోహన్ రాజ్‌గా గుర్తించారు. ఆ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది.
ఈ నేపథ్యంలో తరునేల్వెల్లి జిల్లాకు చెందిన వ్యక్తి, బెంగుళూరులోని ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న జేమ్స్ రాజా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో సీఎం విజయ్‌ని కింపరిచే రీతిలో ఆ వ్యక్తి పోస్టు పెట్టారు. నిందితుడు జేమ్స్ రాజా.. పాలాయమ్ కొట్టై ప్రాంతానికి చెందినట్లుగా గుర్తించారు. గడిచిన రెండు నెలల నుంచి అతను మెడికల్ లీవ్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. పాలయంకొట్టై ఎస్ఐ ప్రకారం నిందితుడు జేమ్స్‌పై కేసు బుక్ చేశారు. అతనిపై నాలుగు సెక్షన్లు విధించారు. కోర్టులో అతన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అతన్ని జుడిషియల్ కస్టడీలోకి తీసుకోనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

