Prisoner Great Escape by Wife | స్కూటీపై వచ్చి పోలీసుల కళ్లగప్పిన మహిళ.. కస్టడీ నుంచి తప్పించుకున్న భర్త
Prisoner Great Escape by Wife | ఒక మహిళ పోలీసుల కళ్లగప్పింది. స్క్యూటీపై వచ్చిన ఆమె పోలీస్ కస్టడీలో ఉన్న భర్త తప్పించుకునేందుకు సహకరించింది. రిమాండ్ ఖైదీ పరార్ను ఆలస్యంగా గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు.
చండీగఢ్: ఒక మహిళ పోలీసుల కళ్లగప్పింది. స్క్యూటీపై వచ్చిన ఆమె పోలీస్ కస్టడీలో ఉన్న భర్త తప్పించుకునేందుకు సహకరించింది. (Prisoner Great Escape by Wife) రిమాండ్ ఖైదీ పరార్ను ఆలస్యంగా గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు. సినిమాను తలపించేలా ఉన్న ఈ సంఘటన హర్యానాలోని పల్వాల్ జిల్లాలో జరిగింది. హోడల్ ప్రాంతానికి చెందిన నిందితుడు అనిల్‌పై హర్యానాతోపాటు ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక కేసులో అతడ్ని అరెస్ట్ చేశారు. రిమాండ్ ఖైదీగా మధుర జైలులో ఉంచారు.
కాగా, హత్యాయత్నం కేసు విచారణ కోసం రిమాండ్ ఖైదీ అనిల్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు తమ వాహనంలో హర్యానాలోని కోర్టుకు తీసుకువచ్చారు. అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన పోలీస్ బృందం అతడి వెంట ఉంది. కోర్టు విచారణ అనంతరం హర్యానా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మధురకు పోలీస్ వాహనంలో బయలుదేరారు. డబ్చిక్లోని జాతీయ రహదారి 19పై వెళ్తుండగా అనిల్ భార్య స్కూటీపై వచ్చింది. పోలీసుల కళ్లగప్పిన ఆమె, వ్యాన్‌లో ఉన్న ఖైదీ భర్తను చాకచక్యంగా తప్పించింది.
మరోవైపు రిమాండ్ ఖైదీ అనిల్ తప్పించుకుని పారిపోయిన విషయాన్ని పోలీసులు చాలా ఆలస్యంగా గుర్తించారు. స్క్యూటీపై వచ్చిన భార్య అతడికి సహకరించినట్లు తెలుసుకున్నారు. అయితే పోలీస్ వ్యాన్‌లో ఉన్న అనిల్‌ను ఆమె ఎలా తప్పించిందో అన్నది తెలియక తలలు పట్టుకున్నారు. అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే పోలీసుల కళ్లగప్పి భర్త పారిపోయేందుకు సహకరించిన అనిల్ భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

