PM tweet: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ అభినందనలు
PM tweet: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. భూపేంద్ర పటేల్ తనకు చాలా ఏండ్లుగా తెలుసని, ఆయన ఉత్తమమైన పనితీరును

న్యూఢిల్లీ: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. భూపేంద్ర పటేల్ తనకు చాలా ఏండ్లుగా తెలుసని, ఆయన ఉత్తమమైన పనితీరును తాను గమనించానని ప్రధాని చెప్పారు. ఆయన భారతీయ జనతాపార్టీ కోసమైనా, పరిపాలనలోనైనా, సమాజసేవలోనైనా ఉత్తమ పనితీరు కనబరుస్తారని కొనియాడారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ ఒక ట్వీట్ ( PM tweet ) చేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు మరో 15 నెలల గడువు మాత్రమే ఉండటంతో బీజేపీ హైకమాండ్ విజయ్ రూపానీ చేత రాజీనామా చేయించి, భూపేంద్ర పటేల్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికచేసింది. ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం భూపేంద్ర పటేల్ గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ క్రమంలో కొత్త ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

