లక్నో: ఒక మహిళా ప్రిన్సిపాల్ క్లాస్‌రూమ్‌లో నిద్రించింది. (school principal caught sleeping) విద్యార్థులైన చిన్న పిల్లలు ఆమెకు గాలి విసిరారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మహిళా ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధానీపూర్ ప్రాంతంలోని గోకుల్‌పూర్‌లో ప్రాథమిక పాఠశాల ఉంది. అక్కడ టీచర్‌గా పని చేస్తున్న డింపుల్ బన్సాల్, స్కూల్ ప్రిన్సిపాల్‌గా కూడా వ్యవహరిస్తున్నది. అయితే తరగతిలోని నేలపై పరిచిన చాపపై ఆమె హాయిగా నిద్రించింది. అక్కడున్న విద్యార్థులు ఆ ప్రిన్సిపాల్‌కు గాలి వచ్చేలా విసిరారు. ఒకరి తర్వాత మరొకరు ఈ పని చేశారు.
కాగా, రహస్యంగా రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈ సంఘటనపై స్పందించారు. మహిళా ప్రిన్సిపాల్ డింపుల్ బన్సాల్‌ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.
#viralvideo अलीगढ़ के धनीपुर ब्लॉक के गोकुलपुर गांव का बताया जा रहा हैं
जहां सरकारी स्कूलों का यह हाल….उमस भरी गर्मी से निजात पाने के लिए बच्चों से करवा रहे है हवा का प्रबंध, शिक्षक तो भगवान होते हैं…. फिर यह शिक्षण संस्थान में घर जैसा माहौल..?@myogiadityanath @Dm_Aligarh pic.twitter.com/503KAwgfVc
— Saurabh Tiwari (शांडिल्य) (@subhamt356) July 27, 2024