President Murmu | నేడు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం.. బహిష్కరించిన ఆప్
President Murmu | 18వ లోక్‌సభ కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి (address joint session) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ప్రసంగించనున్నారు.
President Murmu | 18వ లోక్‌సభ కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. 24, 25 తేదీల్లో సభ్యులు ప్రమాణం చేయగా.. 26వ తేదీన స్పీకర్‌ను ఎన్నుకున్నారు. 18వ లోక్ సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, నేటి నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి (address joint session) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ప్రసంగించనున్నారు. మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్ నుంచి ముర్ము పార్లమెంట్‌కు రానున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌లు రాష్ట్రపతికి స్వాగతం పలికి సభలోకి తోడ్కొని వెళ్లనున్నారు. అనంతరం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ ప్రాధమ్యాలను ఆమె వివరించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ్యులు చర్చించనున్నారు. అయితే, రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కరించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ సుప్రిమో, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ గురువారం ప్రకటించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 87 ప్రకారం.. లోక్‌సభ కొత్తగా కొలువుదీరిన ప్రతిసారీ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిచాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం పార్లమెంట్ మొదటి షెషన్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుంటారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రభుత్వ కార్యక్రమాలు, విధి విధానాలను వివరిస్తుంటారు. తాజా ప్రసంగంలో గత పదేళ్లలో చేపట్టిన పథకాలతోపాటు రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధమ్యమాలను ముర్ము తన ప్రసంగంలో ప్రస్తావించే అకవాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపారు.
Also Read..
LK Advani | నిలకడగానే అద్వానీ ఆరోగ్య పరిస్థితి.. ఎయిమ్స్ వైద్యులు
Delhi | ఢిల్లీలో భారీ వర్షం.. మండుటెండల నుంచి ఉపశమనం
BSNL | హ్యాకర్ల చేతిలో బీఎస్ఎన్ఎల్ డాటా.. డార్క్ వెబ్‌లో అమ్మకానికి!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

