NTR | ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపదీముర్ము
ఎన్టీఆర్ (NTR) శతజయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము (President Droupadi murmu) విడుదల చేశారు.
న్యూఢిల్లీ: ఎన్టీఆర్ (NTR) శతజయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము (President Droupadi murmu) విడుదల చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని (Rashtrapati bhavan) సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నటుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌తో పనిచేసిన సన్నిహతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ముర్ము మాట్లాడుతూ.. భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీర్ ఎంతో ప్రత్యేకమన్నారు. కృష్ణుడు, రాముడి వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతమని, ప్రజల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తన ప్రత్యేకత చాటుకున్నారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని వెల్లడించారు. ఎన్టీఆర్ విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పారు.
హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో తయారైన ఈ స్మారక నాణెం.. 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలిపి ఉంటుంది. ఓ వైపు ఎన్టీఆర్ బొమ్మ ఉంటే మరోవైపు మూడు సింహాల బొమ్మ ఉంటుంది. ఎన్టీఆర్ శత జయంతి అని హిందీలో రాసి దాని కింద 1923-2023 అని రాసుంటుంది.

Ntr 1
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

